AP: ఆస్తుల కోసం కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన YCP చీఫ్ జగన్ మహిళా పక్షపాతి ఎలా అవుతారని TDP ఎమ్మెల్యే గౌతు శిరీష నిలదీశారు. జగన్ పాలనలో రాష్ట్రంలోని మహిళలు, దళితులపై దాడులు నిత్యకృత్యంగా జరిగేవని విమర్శించారు. రాజధాని కోసం భూములిచ్చిన మహిళా రైతుల్ని రోడ్లపైకి ఈడ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని దుయ్యబట్టారు.