BHPL: టేకుమట్లలో రోజు రోజుకూ సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే ముగ్గురు వ్యక్తులు మోసగాళ్ల వలలో చిక్కుకుని డబ్బులు కోల్పోయారు. ఈ నెల 5న ఒక వ్యక్తి సుమారు రూ. 30,000, నాలుగు రోజుల క్రితం మరో వ్యక్తి రూ. 9,000, తాజాగా మరో బాధితుడు రూ. 10,000 కోల్పోయారు. మోసగాళ్లు ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా మోసం చేసి డబ్బులు దోచుకుంటున్నారు.