NLG: వేసవి నేపథ్యంలో నకిరేకల్ నిమ్మ మార్కెట్కు నిమ్మకాయలు భారీగా తరలివస్తున్నాయి. డిమాండ్ పెరగడంతో పచ్చికాయల బస్తా రూ.2,500 – 3,000, పండ్ల బస్తా రూ.3,000 – 3,500 వరకు పలుకుతోంది. మంచి గిట్టుబాటు ధర పలుకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మకాయలకు ఏడాది పొడవునా ఇలాగే స్థిరమైన ధర ఉంటే తాము నష్టపోకుండా ఉంటామని రైతులు పేర్కొంటున్నారు.