AP: కడప జిల్లా బద్వేల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఇంధనం కొరతతో యాజమాన్యాలు ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు చేశాయి. కంపెనీల నుంచి సరఫరా నిలిచిపోయిందని, అందుకే స్టాక్ లేదని నిర్వాహకులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.