ATP: గుత్తి ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఎస్సీ, ఎస్టీ మహిళలకు పీఎం అజయ్ యోజన కింద ఆర్థిక సాయం అందించారు. తొమ్మిది మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున సబ్సిడీ చెక్కులు పంపిణీ చేశారు. మహిళలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.