NZB: హిట్ & రన్ కేసులో మాజీ MLA షకీల్ కుమారుడు రాహెల్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట శనివారం లొంగిపోయాడు. 2022లో బెలూన్లు అమ్మే మహిళ కాజోల్ చౌహాన్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రోడ్డు దాటుతుండగా MLA స్టిక్కర్ ఉన్న షకిల్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ చేతిలో ఉన్న శిశువు కిందపడి మృతిచెందింది. ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో షకిల్ కుమారుడిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.