శ్రీరామునిపై ప్రకాష్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నాగబాబు తన సోషల్ మీడియాలో పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పేరు ఎత్తకుండానే ‘రాముడిని కించపరచడం సాహసం కాదు, అది అహంకారం, అజ్ఞానం’ అంటూ మండిపడ్డారు. ధర్మానికి వ్యతిరేకంగా విషం చిమ్మే వారిని చరిత్రే అణచివేస్తుందని.. రాముడిని ఎగతాళి చేసే వారు తమను తామే గాయపరుచుకుంటారని నాగబాబు ఘాటుగా స్పందించారు.