MBNR: ఏడు గిరిదుర్గాల్లో ఒకటైన కోయిలకొండ కోట చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. 14వ శతాబ్దంలో అళియ రామరాయల కాలంలో వడ్డెరాజులు నిర్మించిన ఈ కోట తరువాత వెలమ రాజుల వశమైంది. కొండపై దేవాలయం ఉండటంతో ‘కోవెలకొండ’గా పిలిచేవారని, తరువాత కోయిలకొండగా మారిందని చెబుతారు. ఈ కోట నిర్మాణ కౌశలం నేటికీ ఆకట్టుకుంటోంది.