అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి శనివారం యార్డ్లో ఆకస్మికంగా పర్యటించారు. చీనీ రైతులు, పశువుల వ్యాపారులు, కోళ్ల వ్యాపారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. రైతులు, వ్యాపారుల కష్టాలను అర్థం చేసుకున్నామని, త్వరలోనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.