కోనసీమ: నేడు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఎర్రవంతెన వద్ద ఉన్న ఆయన క్యాంపు కార్యాలయం వద్ద ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి అర్జీల రూపంలో సమర్పించవచ్చని సూచించారు.