సత్యసాయి: మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుని విపక్ష కూటమి చేస్తున్న ప్రచారంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. 106వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రిజర్వేషన్లు అమలవుతాయని ఆయన స్పష్టం చేశారు. నాడు ఈ నిబంధనను వ్యతిరేకించని వారు, ఇప్పుడు రాజకీయం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.