గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో రామ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘ది ఇండియా హౌస్’. నిఖిల్, సాయి మంజ్రేకర్ జంటగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 30% పూర్తయినట్లు తెలుస్తోంది. కీలకమైన సన్నివేశాల కోసం అనుపమ్ ఖేర్, నిఖిల్ తదితర కీలక నటీనటుల డేట్స్ కోసం చిత్ర బృందం ఎదురుచూస్తుందట. ఇక ఈ ఏడాది డిసెంబర్లో దీన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.