VKB: 2026- 27 విద్యా సంవత్సరానికి బంట్వారం మోడల్ స్కూల్లో ప్రవేశ పరీక్ష రేపు జరగనుంది. 6వ తరగతి పరీక్ష ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7- 10 తరగతుల ఖాళీ సీట్లకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు చేసిన విద్యార్థులు హాల్ టికెట్, ఆధార్ కార్డుతో రేపు ఉదయం 9.30 గంటలకు (బంట్వారం మోడల్ స్కూల్) చేరుకోవాలని సూచించారు.