NTR: అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన దేవాదాయ శాఖ అధికారిణి శాంతిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో రెండు రోజుల పాటు విచారించినా కీలక సమాచారం రాబట్టలేకపోయామని, ఆమె ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మరింత విచారణ కోసం 10 రోజుల కస్టడీ కోరగా, నేడు కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.