MHBD: మరిపెడ మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎంపికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 16 మంది ఆశావహులు నామినేషన్లు దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ విజయానంద్ ఇవాళ తెలిపారు. వీరిలో ముస్లిం మైనారిటీ వర్గం నుంచి 9మంది, బీసీ విభాగం నుంచి 5గురు, ఎస్టీ వర్గం నుంచి ఇద్దరు నామినేషన్లు వేశారు. ఓసీ వర్గం నుంచి ఎలాంటి దరఖాస్తులు రాలేదన్నారు.