‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో విజయం అందుకున్న దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ మరో ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమయ్యాడు. తన రెండవ సినిమాను కూడా UV క్రియేషన్స్ బ్యానర్లో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్లు, ఆ కథకు తగిన హీరో కోసం మూవీ బృందం వెతుకులాటను ప్రారంభించినట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.