TG: కేసీఆర్ భ్రమల్లో ఉన్నారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సవాల్‌కు సిద్ధమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రాజెక్టు పూర్తయినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ వచ్చింది కాబట్టే పెద్దోడు.. పేదోడు ఒకే బువ్వ తింటున్నారని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పింది కేసీఆరే, ప్రక్షాళన చేయకుండా వెనక్కి తగ్గింది కూడా ఆయనేనని గుర్తు చేశారు.