జూన్ 6 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే, ఐపీఎల్లో సుదీర్ఘకాలం బిజీగా ఉన్న భారత టాప్ ప్లేయర్లకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆటగాళ్ల పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని టీమిండియా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కీలక ఆటగాళ్లకు విరామం దొరకడమే కాకుండా, యువ ఆటగాళ్లకు తమ సత్తా చాటుకునే ఛాన్స్ లభిస్తుంది.