WGL: ఏనుమాముల మార్కెట్లో అడ్డిదారులను మోసం చేసిన గాయత్రి చిల్లీస్ కంపెనీ వ్యాపారి లడే తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. 49 మంది నుంచి మిర్చి కొనుగోలు చేసి, అదే సరకును ఇతరులకు విక్రయించి సుమారు రూ. 2.5 కోట్లు మింగి పరారీలో ఉన్నాడు. ఈ నెల 2న విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేశారు. దేశాయిపేట వద్ద అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.