NDL: పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ సునీల్ షోరాణ్ తెలిపారు. శుక్రవారం జరిగిన పోలీస్ వెల్ఫేర్ డేలో మాట్లాడుతూ.. సిబ్బంది తమ సమస్యలను నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విధి నిర్వహణలో ఇబ్బందులు లేకుండా, ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.