NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈనెల 22న అన్యువల్ డే నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. బోధన, బోధనేతర సిబ్బంది TU అన్యువల్ డేకి హాజరుకావాలని ఆదేశించారు. సంవత్సరంలో జరిగిన ప్రగతిని నివేదించడంతో పాటు విద్యార్థుల ప్రతిభను గుర్తించి, విద్యార్థుల భవిష్యత్తుపై మార్గ నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.