TG: ఆందోల్ నియోజకవర్గంలో ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆందోల్ చెరువు వద్ద రూ.5 కోట్ల నిధులతో టూరిజం రెస్టారెంట్‌కు, జోగిపేటలో రూ.20 కోట్లతో సమగ్ర కార్యాలయ సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, జోగిపేటలో రూ.53 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభిస్తారు.