ప్రయాణంలో పొదుపు పాటించాలంటే టికెట్లను కొన్ని నెలల ముందే బుక్ చేసుకోవాలి. చివరి నిమిషంలో బుకింగ్స్ వల్ల ధరలు భారమవుతాయి. పర్యాటక ప్రాంతాల్లో తిరగడానికి ఖరీదైన క్యాబ్‌ల కంటే ప్రజారవాణాను వాడటం మేలు. గైడ్లను నియమించుకోకుండా ఆన్లైన్లో సమాచారం చూసుకోవచ్చు. ఖరీదైన హోటళ్లకు బదులుగా హాస్టల్స్ లేదా క్యాంపింగ్ ఎంచుకుంటే తక్కువ ఖర్చుతోనే విహారయాత్రను పూర్తి చేయొచ్చు.