విహారయాత్రలకు బడ్జెట్ సమస్య కాకూడదంటే ముందస్తు పొదుపు అవసరం. రోజువారీ ఖర్చులైన టీ, కాఫీలను తగ్గించడం, అనవసరమైన ఓటీటీ సబ్స్క్రిప్షన్లను కట్ చేస్తే కొంత డబ్బు ఆదా చేయొచ్చు. నెలలో కొన్నిసార్లు బయట తినడం మానేసి, ఆ మొత్తాన్ని ఒక ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి. క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఉపయోగించి విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్‌లో భారీ డిస్కౌంట్లు పొందవచ్చు.