BHNG: చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీలో శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా 14 ఏళ్లకు పైబడిన వారికి ఛాతీ డిజిటల్ ఎక్స్రేలు తీసి,లక్షణాలున్న వారిని పరీక్షించారు.