TG: రైతు సంఘం రాష్ట్ర మహాసభలు ఈనెల 23, 24, 25 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం నాయకులు వెల్లడించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మద్దతు ధర అమలు, పూర్తి రుణమాఫీ, పోడు సాగుదారులకు హక్కులు, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, కౌలు రైతులకు గుర్తింపు వంటి అంశాలపై సభలో చర్చిస్తామని తెలిపారు. రైతులు అప్పుల బారినపడుతున్నారని సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.