SRPT: అనంతగిరి మండలం మొగలాయి కోట గ్రామానికి వెళ్లే రెండు కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి శిలాఫలకం వేసి ఏడాది గడిచినా పనులు ప్రారంభం కాలేదు. హామీలు మాత్రమే మిగిలి, ప్రాజెక్ట్ కాగితాలకే పరిమితమైందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు కథనాలు వచ్చినా అధికారుల్లో చలనం లేదని వాపోతున్నారు.