MBNR: మహబూబ్నగర్ పాలమూరు యూనివర్సిటీ పరిధిలో రేపు (ఏప్రిల్ 16) వివిధ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు ఆరో సెమిస్టర్ విద్యార్థులకు ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా, మధ్యాహ్నం సెషన్లో రెండో సెమిస్టర్ బ్యాక్లాగ్ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ పరీక్ష జరగనుంది.