హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,420 పెరిగి రూ.1,55,350కి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,300 పెరిగి రూ.1,42,400గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర ఏకంగా రూ.10,000 పెరిగి రూ.2,75,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.