KMM: కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ లోపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధుల్లో చెత్తాచెదారం పేరుకుపోయి, డ్రైనేజీలు పూడికతో మురుగు నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు కోతులు, కుక్కలు, పందుల స్వైర విహారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి పారిశుధ్యం మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు.