BDK: ఒకప్పుడు కార్మికులతో కళకళలాడిన కొత్తగూడెం, పాల్వంచ నగరాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. సింగరేణి గనుల మూత, కేటీపీఎస్ పాత ప్లాంటు మూసివేతతో కార్మికులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీని ప్రభావంతో వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నాయి. అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో స్థానికులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.