NGKL: విద్యుత్ శాఖ ఆర్టిజన్, పీస్ రేట్ కార్మికుల సమ్మె ఆదివారం 5వ రోజుకు చేరింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,500 మంది కార్మికులు నిరసనలో పాల్గొంటున్నారు. వీరి సమ్మె ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి, గంటల తరబడి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.