PLD: సత్తెనపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వినతి పత్రాలు ఆయనకు సమర్పించారు. ఫిర్యాదులను స్వీకరించిన కన్నా, సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.