రెబల్ స్టార్ ప్రభాస్తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం డిజిటల్, శాటిలైట్ హక్కులను ఇప్పుడే అమ్మకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ పూర్తయ్యాక, మూవీపై మరింత హైప్ పెరిగిన తర్వాతే వీటిని విక్రయించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.