SRCL: ప్రతి ఒక్కరూ హిమోఫిలియా పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. ఇవాళ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీ చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..హిమోఫిలియా వ్యాధికి చికిత్స అందించి అవయవాల లోపాలను అరికట్టవచ్చన్నారు. ఇందులో వైద్యాధికారులు రేఖ, సాహితీ ఉన్నారు.