VKB: పరిగి పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో రేపు జరగనున్న హిందూ సమ్మేళనాన్ని పురస్కరించుకొని ప్రతి గడపను కదిలించడానికి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి బైక్ ర్యాలీ చేపడుతున్నట్టు సమ్మేళన సమితి అధ్యక్షుడు డా. దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.