KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని పార్సెల్ సర్వీస్ ఏజెన్సీల్లో ఇవాళ స్థానిక పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గంజాయి, గుట్కా, అక్రమ మద్యం, నిషేధిత వస్తువుల రవాణాను అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టారన్నారు. 2 టౌన్ SI రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో కొరియర్ పార్శిల్ సర్వీస్ ఏజెన్సీల్లో బిల్లులను పరిశీలించి, నిషేధిత వస్తువులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.