CTR: నగిరి డివిజన్లో జలధార కార్యక్రమం, నీటి భద్రత అంశాలపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జలధార కార్యక్రమం అమలు పురోగతి, చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు, తాగునీటి సరఫరా వంటి కీలక అంశాలపై అధికారులు సమగ్ర నివేదికలు సమర్పించారు.