NLR: జాతీయస్థాయి ఎస్జీఎఫ్ఐ సెపక్ తక్రా పోటీలకు కొత్తూరు ఆఫ్ ఇందుకూరుపేట ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని లేబూరు వెంకట కావ్య ఎంపికైనట్లు హెచ్ఎం మల్లికార్జున ఇవాళ తెలియజేశారు. ఇటీవల రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆమె అత్యున్నత ప్రతిభ సాధించి జాతీయస్థాయి పోటీలకు దూసుకెళ్లిందన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, స్నేహితులు ఆమెకు అభినందనలు తెలియజేశారు.