అన్నమయ్య: రెవెన్యూ సేవల్లో వేగం, పారదర్శకత పెంచి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను గడువులోగా క్లియర్ చేయాలని సూచించారు. జిల్లాలో వచ్చిన 33,153 సమస్యల్లో 83.42% ఇప్పటికే పరిష్కరించినట్లు తెలిపారు. మ్యూటేషన్ ప్రక్రియలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.