VZM : ఎల్.కోట మండలంలో మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలల్లో పిల్లలను చేర్పించడంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.