కర్నూలు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈనెల 20న నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంతో పాటు అన్ని మండల తహసీల్దార్, ఆర్డీవో, మునిసిపల్ కార్యాలయాల్లో వినతులు స్వీకరిస్తారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.