NRPT: కృష్ణ మండలం ముడుమాల్ దొడ్డిలో సర్వే నం.68లోని 36 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకోవడంపై బీసీ సంఘం నేత అంజనేయులు ముదిరాజ్ మండిపడ్డారు. రాజకీయ అండతో దందా సాగుతోందని ఆరోపించారు. 15 మందికి నోటీసులు ఇచ్చినా చర్యలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వెంటనే విచారణ జరిపి భూమిని స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు.