RR: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పిన విద్యార్థుల కోసం RR, VKB జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. IAS నవీన్ ఆదేశాల మేరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 వరకు మోడల్ స్కూళ్లలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానుండగా, మే 12 వరకు తప్పిన సబ్జెక్టుల్లో శిక్షణ ఇస్తారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తారు.