BPT: బల్లికురవ మండలం నక్కబొక్కలపాడులో రైతులకు ఎరువుల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. భూసార పరీక్షల ఫలితాల ప్రకారమే ఎరువులు వాడాలని, మోతాదుకు మించి వాడితే పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గుతుందని వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు. జింక్ సల్ఫేట్, జిప్సం వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.