TG: ఖమ్మం జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ మినీ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ కీలక సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.