NLG: సికింద్రాబాద్-హౌరా ఫలక్నామా ఎక్స్ప్రెస్ కింద పడి సుమారు 55 ఏళ్ల గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకుంది. శనివారం రాత్రి చిట్యాల-శ్రీరాంపురం మధ్య గోపలాయపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. మృతురాలు స్కై కలర్ జాకెట్, తెలుపు-పచ్చ రంగు చీర ధరించి ఉంది. స్టేషన్ మాస్టర్ అభినవ్ ఫిర్యాదుతో నల్గొండ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.