AP: రాజధాని నిర్మాణంపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. ‘రూ.లక్షల కోట్ల అంచనాలతో అమరావతి ప్రణాళిక ఉంది. అప్పులపై ఆధారపడే రాజధాని నమూనా సరికాదు. రైతులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైంది. ఏకీకత, దశలవారీ అభివృద్ధితో రాజధాని నిర్మించాలి. ఆర్థిక క్రమశిక్షణ కలిగిన రాజధాని అవసరం’ అని పేర్కొన్నారు.