PLD: పెదనందిపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గుడిపాడులో పర్యటించి, ప్రజల ఇబ్బందులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. వీటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అండగా ఉంటూ సమస్యలు తీర్చడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.