BDK: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు వచ్చే నెల ఆరవ తేదీన మహా కుంభాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఈ మహోత్సవాలకు హాజరుకావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వాన పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.